చంద్రబాబు వుండగా ఆంధ్రప్రదేశ్లో జేఏసీ ఎందుకు?: కేశినేని నాని
- జేఏసీ కోసం పవన్ ప్రయత్నాలు
- చంద్రబాబు ఉండగా ఆ అవసరం లేదు
- చంద్రబాబు నిర్ణయం మేరకు మేము ముందుకు వెళతాం
- కేంద్ర ప్రభుత్వం ఇచ్చే హామీలను, చెప్పే మాటలను నమ్మేది లేదు
ఈ రోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ఇచ్చే హామీలను, చెప్పే మాటలను నమ్మేది లేదని అన్నారు. రాష్ట్రానికి నిధులివ్వాలని, చేతల్లో మాత్రమే చూపాలని అన్నారు. వచ్చే నెల 5న ఉభయ సభలను స్తంభింపజేస్తామని అన్నారు. ఏపీకి అన్యాయం జరిగిందని జాతీయ పార్టీలన్నీ అంగీకరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు నిర్ణయం ప్రకారం ముందుకెళతామని చెప్పారు.