సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • కేన్స్ ఫెస్టివల్ కి సమంత సినిమా!
  • 'ఇది నా లవ్ స్టోరీ' అంటున్న తరుణ్!
  • తెలుగులో హిందీ హిట్ సినిమా 
  • విశాఖ బీచ్ లో రవితేజ షూటింగ్  
*  ప్రస్తుతం అందాల సమంత తమిళంలో 'సూపర్ డీలక్స్' అనే చిత్రంలో నటిస్తోంది. త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ హీరోలుగా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని వచ్చే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కి పంపడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట.
*  తరుణ్ హీరోగా రమేష్ గోపి దర్శకత్వంలో రూపొందిన 'ఇది నా లవ్ స్టోరీ' చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న దీనిని రిలీజ్ చేయనున్నారు.
*  హిందీలో హిట్టయిన '2 స్టేట్స్' చిత్రాన్ని అడవి శేష్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నూతన దర్శకుడు వెంకట్ రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి జరుగుతుంది. ఈ చిత్రం ద్వారా సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ కూతురు శివాని హీరోయిన్ గా పరిచయమవుతోంది.
*  రవితేజ హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'నేల టికెట్' చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా విశాఖపట్నంలో జరుగుతోంది. ప్రస్తుతం విశాఖ బీచ్ వద్ద కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో మాళవిక శర్మ నాయికగా నటిస్తోంది.  
Samantha
Tarun
Rajashekhar
Raviteja

More Telugu News