కేంద్రం నుంచి ఏపీ సీఎంఓకు ఫోన్ కాల్ !

  • ఏపీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఢిల్లీ బయల్దేరి రావాలి
  • రెవెన్యూ లోటు, స్పెషల్ ప్యాకేజీపై చర్చిద్దామన్న కేంద్రం
  • ఢిల్లీ బయలుదేరిన ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్  
కేంద్ర బడ్జెట్ లో, రాష్ట్ర విభజన హామీల అమలు విషయంలో ఏపీకి అన్యాయం జరిగిందంటూ పార్లమెంట్ ఉభయసభల్లో టీడీపీ నేతలు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ తాజా పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తక్షణం ఢిల్లీకి బయలు దేరి రావాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ ఆహ్వానం పంపింది.

 ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)కు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చినట్టు సమాచారం. రెవెన్యూ లోటు, స్పెషల్ ప్యాకేజీపై చర్చించేందుకు పూర్తి సమాచారంతో రావాలని కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు ఈ మేరకు కోరినట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కుటుంబరావు ఢిల్లీ బయలుదేరినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
central finance ministry
ap cmo

More Telugu News