నిఖిల్ సినిమాకు 'బాహుబలి' కెమెరామెన్
- తెలుగు రీమేక్ గా తమిళ 'కణితన్'
- తెలుగు వెర్షన్ కి కూడా తమిళ దర్శకుడే
- త్వరలో సెట్స్ పైకి
కన్నడ సినిమా రీమేక్ గా 'కిరాక్ పార్టీ' చేసిన నిఖిల్, త్వరలో తమిళ సినిమా 'కణితన్' కు రీమేక్ చేయనున్నాడు. 'కణితన్' దర్శకుడు సంతోష్ తెలుగులోనూ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ రీమేక్ కి సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ కుమార్ ను తీసుకున్నట్టుగా సమాచారం. ఆయన రాకతో ఈ ప్రాజెక్టుపై మరింత క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.