కెనడాలో గుండెపోటుతో మరణించిన కన్నడ నటుడు
- దాదాపు 60 చిత్రాల్లో నటించిన చంద్రశేఖర్
- బాలనటుడిగా ప్రవేశించి రాణించిన చంద్రశేఖర్
- పరిశ్రమ ప్రముఖుల సంతాపం
'సంపంతిగె సవాల్', 'హంసగీతె', 'రాజా నన్న రాజ' వంటి హిట్ చిత్రాల్లో నటించడంతో పాటు 'పూర్వపర' అనే సినిమానూ నిర్మించారు. దాదాపు 60 సినిమాల్లో నటించిన ఆయన ఆఖరి చిత్రం '3 గంటె 3 దిన 30 సెకండ్' మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. కెనడాలోని భారత రాయబార కార్యాలయంలోనూ ఈయన పని చేశారు. చంద్రశేఖర్ మృతి పట్ల కన్నడ చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలిపారు.