స్టార్ హీరోల అభిమానుల మధ్య ముదురుతోన్న రచ్చ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్టార్ హీరోల అభిమానుల మధ్య ముదురుతోన్న రచ్చ!

  • అజిత్ 'వీరమ్'కి ఎక్కువ టీఆర్పీ రేటింగ్
  • విజయ్ 'మెర్సల్'కి తక్కువ టీఆర్పీ 
  • ఇద్దరి అభిమానులమధ్య గొడవలు  
స్టార్ హీరోల అభిమానులు తమ హీరో గొప్ప అంటే .. తమ హీరోనే గొప్ప అంటూ గొడవలు పడుతుండటం సహజంగా జరుగుతూ ఉంటుంది. వ్యూస్ విషయంలో .. వసూళ్ల విషయంలో ఈ గొడవలు ఎక్కువగా జరుగుతుంటాయి. తాజాగా తమ హీరోల టీఆర్పీ రేటింగ్స్ విషయంలో అజిత్ .. విజయ్ ఫ్యాన్స్ గొడవలు పడుతున్నారు.

అజిత్ హీరోగా చేసిన 'వీరమ్' సినిమా తొలిసారి టీవీ ఛానల్లో ప్రసారమైనప్పుడు, 18.1 టీఆర్పీ రేటింగ్ దక్కించుకుని టాప్ ప్లేస్ లో నిలిచింది. రెండవసారి ఈ సినిమా ప్రసారమైనప్పుడు టీఆర్పీ రేటింగ్ 9 వచ్చింది. అయితే విజయ్ హీరోగా చేసిన 'మెర్సల్' తొలిసారి ప్రసారమైనప్పుడే 8.5 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. దాంతో విజయ్ కంటే అజిత్ గొప్ప అంటూ ఆయన ఫ్యాన్స్ వాదిస్తున్నారు. మరోపక్క, అజిత్ ప్లాప్ సినిమాల రేటింగ్స్ గురించి మాట్లాడుతూ విజయ్ ఫ్యాన్స్ గొడవలకి దిగుతున్నారు. దాంతో ఇద్దరి హీరోల అభిమానుల మధ్య గొడవలు ముదురుతున్నాయి.  
ajith
vijay

More Telugu News