ధోనీ వస్తున్నాడు...వన్డే సిరీస్ ను కోల్పోము: శ్రేయస్ అయ్యర్
- టెస్టు సిరీస్ లో టీమిండియా ఓటమి
- వన్డే సిరీస్ కోసం త్వరలో ఆటగాళ్ల పయనం
- వన్డే సిరీస్ విజయంపై శ్రేయస్ విశ్వాసం
టెస్టు సిరీస్ ఓటమితో జట్టు ఏమాత్రం కుంగిపోదని అన్నాడు. తిరిగి పుంజుకోగల సామర్థ్యం ఉందని చెప్పాడు. జట్టు సామర్థ్యానికి తోడు ధోనీ రాక జట్టును మరింత బలోపేతం చేయనుందని అన్నాడు. గతంలో టీమిండియాను సఫారీ గడ్డపై నడిపించిన అనుభవం ఉపయోగపడుతుందని చెప్పాడు. ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యం వన్డే సిరీస్ ను చేజిక్కించుకోవడమేనని అయ్యర్ తెలిపాడు. సఫారీ పిచ్ లకు, మన పిచ్ లకు చాలా వ్యత్యాసం ఉన్న కారణంగా అక్కడికి వెళ్లాక గోల్ సెట్ చేసుకుంటానని చెప్పాడు.