పురుషులకు నిద్ర తక్కువైతే క్యాన్సరే
ఆధునిక ప్రపంచం సగటు నిద్రాకాలం తగ్గుతోంది. ఇదివరకటి లా కాకుండా పరిమితమైన గంటల వ్యవధి మాత్రమే నిద్రకు కేటాయించే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇలాంటి వారిలో పురుషులకు ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం రెండింతలు ఎక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి.
నిద్ర సంబంధమైన సమస్యలు మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌కు దారితీస్తాయని ఇదివరకటి నుంచే వైద్యులు నమ్ముతున్నారు. ఇదే నిద్ర సమస్యలు పురుషుల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకోవడానికి జరిపిన పరిశోధనలు దిగ్భ్రాంతికర వాస్తవాల్ని వెల్లడించాయి. రేజవిక్‌లోని ఐస్‌లాండ్ యూనివర్సిటీకి చెందిన లారా సిగుర్దార్ డాటిర్ బృందం ఈ విషయంలో పరిశోధనలు చేశారు. 2425 మంది పురుషుల్ని పరిశీలించారు. వీరిలో నిద్రలేమి సమస్య స్థాయిలను గుర్తించి, అయిదేళ్ల తర్వాత మళ్లీ పరిశీలించారు. సాధారణ పురుషుల్లో 1.6 శాతం మందికి ప్రొస్టేట్ క్యాన్సర్ సోకగా, నిద్రలేమితో బాధపడుతున్న వారిలో అది రెండింతలుగా నమోదైంది. ఎంతకూ నిద్రపట్టకపోవడం, మధ్య రాత్రిలో మెలకువ రావడం, గాఢంగా నిద్రపోలేకపోవడం దీనికి దారితీస్తున్నాయి. నిద్రకు, ప్రొస్టేట్ క్యాన్సరుకు సంబంధం ఏంటో నికరంగా తేలితే.. చికిత్సలు కూడా మెరుగ్గా చేయవచ్చునని భావిస్తున్నారు.