విభజన హామీల అమలులో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని రాష్ట్రపతికి కేవీపీ లేఖ !
- ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి
- ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని వినతి
- భారత రాజ్యాంగం ఆర్టికల్ 78 ద్వారా నివేదిక తెప్పించుకోవాలని విజ్ఞప్తి
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ప్రస్తావించిన అంశాలు సహా రాజ్యసభలో ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి ప్రస్తుత వాస్తవ పరిస్థితుల గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ నివేదిక తెప్పించుకోవాలని లేఖలో కోరారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 78 ద్వారా సంక్రమించిన విశేష అధికారాలను ఉపయోగించి నివేదిక తెప్పించుకోవాలని విజ్ఞప్తి చేశారు.