'అజ్ఞాతవాసి' తొలివారం వసూళ్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అజ్ఞాతవాసి' తొలివారం వసూళ్లు!

  • 'అజ్ఞాతవాసి' గ్రాస్ వసూళ్లు అధికం 
  • అదనపు షోలు ఒక కారణం 
  • టికెట్ రేట్లు పెంచడం మరో కారణం  
పవన్ కల్యాణ్ అభిమానుల నిరీక్షణకు తెరదించేస్తూ .. ఈ నెల 10వ తేదీన 'అజ్ఞాతవాసి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. తొలి ఆటతోనే ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ, వసూళ్ల ప్రభావం మాత్రం బాగానే కొనసాగిందని చెప్పాలి.

 పవన్ సినిమా ఎలా వున్నా ఒకసారి చూడాలంటూ అభిమానులు థియేటర్స్ కి రావడమే అందుకు కారణం. తొలివారంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 39.15 కోట్ల షేర్ ను .. 59.7కోట్ల గ్రాస్ ను సాధించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే .. 54.95 కోట్ల షేర్ ను .. 88.7 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. అదనపు షోలు .. టికెట్ రేటు ఎక్కువగా ఉండటం వలన ఈ స్థాయి గ్రాస్ వసూళ్లు సాధించడం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.    
pavan
keerti suresh

More Telugu News