సెంచూరియన్ టెస్టు..వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా
- దక్షిణాఫ్రికా - భారత్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్
- మోర్నీ మోర్కెల్ బౌలింగ్ లో వరుసగా రెండు వికెట్లు పతనం
- ఓపెనర్ లోకేశ్ రాహుల్ (10), ఛటేశ్వర్ పుజారా డక్కౌట్
ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన పుజారా మోర్కెల్ వేసిన నాల్గో బంతిని కొట్టి పరుగు చేద్దామనుకున్నాడు. సహ బ్యాట్స్ మెన్ మురళీ విజయ్ స్పందించకపోయినప్పటికీ ఈ పరుగు చేసేందుకు పుజారా తొందరపడ్డాడు. తన తప్పు తెలుసుకుని వెనక్కి పరిగెత్తే లోపే ఎంగిడి వేసిన త్రో వికెట్లకు తాకడంతో రన్ ఔటయ్యాడు. కాగా, ప్రస్తుతం క్రీజ్ లో విజయ్, కోహ్లీ ఉన్నారు. 28 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ : 80/2