బంజారాహిల్స్‌లో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. పోలీసుల అదుపులో రష్యన్ యువతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బంజారాహిల్స్‌లో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. పోలీసుల అదుపులో రష్యన్ యువతి

  • గెస్ట్ హౌస్‌లో జోరుగా సాగుతున్న దందా
  • పక్కా సమాచారంతో దాడిచేసిన పోలీసులు
  • నిర్వాహకుడి సహా  పలువురు అరెస్ట్
హైదరాబాద్‌లో మరో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయింది. బంజారాహిల్స్‌లోని ఓ గెస్ట్‌హౌస్‌లో పెద్ద ఎత్తున వ్యభిచారం జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు గెస్ట్‌హౌస్‌పై దాడిచేశారు. ముఠా నిర్వాహకుడు, మరో యువకుడు, రష్యన్ యువతితో పాటు మరో ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.

నిర్వాహకుడిని తమిళనాడుకు చెందిన అలెక్స్ (40)గా గుర్తించారు. పోలీసుల అదుపులో ఉన్న వారిలో యువకుడు బీహార్‌కు చెందిన పంకజ్ కుమార్ మండల్ కాగా, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మహిళ, యువతులు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతులను సంరక్షణ గృహానికి పంపించారు.  
Hyderabad
Banjara Hills
Police

More Telugu News