lal bahdur shashtri: లాల్ బహదూర్ శాస్త్రి బయోపిక్ పేరు... ద తాష్కెంట్ ఫైల్స్
- వర్ధంతి సందర్భంగా వెల్లడించిన వివేక్ అగ్నిహోత్రి
- ప్రధాన పాత్రల్లో మిథున్ చక్రవర్తి, నసీరుద్దీన్ షా
- 1966, జనవరి 11న మరణించిన మాజీ ప్రధాని
భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 52వ వర్ధంతి సందర్భంగా ఆయన జీవితకథ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రానికి 'ద తాష్కెంట్ ఫైల్స్' అని పేరు నిర్ణయించినట్లు ఫిల్మ్ మేకర్ వివేక్ అగ్నిహోత్రి వెల్లడించారు. 1966, జనవరి 11న తాష్కెంట్ ఒప్పందం జరిగిన గంటల్లోనే ఆయన చనిపోయారు. అయితే ఆయనది సహజ మరణమా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే విషయంపై స్పష్టత లేదు.
ఈ అంశాన్ని కథగా తీసుకుని తాను సినిమాను నిర్మించబోతున్నట్లు వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ చేశారు. ఇందులో నసీరుద్దీన్ షా, మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించబోతున్నట్లు అగ్నిహోత్రి తెలిపారు. వాళ్లిద్దరూ కలిసి నటించి చాలా కాలమైందని, తెర మీద ఓ కొత్త అవతారంలో వాళ్లు కనిపించబోతున్నారని వివేక్ ట్వీటారు. అయితే ఈ సినిమా విడుదలకు సంబంధించి ఎలాంటి వివరాలు తెలియరాలేదు.