'గురు' దర్శకురాలితో సూర్య మూవీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'గురు' దర్శకురాలితో సూర్య మూవీ!

  • సెల్వ రాఘవన్ తో సూర్య మూవీ 
  • లైన్లో ముగ్గురు దర్శకులు 
  • సుధా కొంగరతోను కథా చర్చలు      
సూర్య వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తమిళంలో చేసిన తన సినిమాలను తెలుగులోను విడుదల చేస్తూ వస్తున్నాడు. అలా ఈ నెల 12వ తేదీన 'గ్యాంగ్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకి రెడీ అవుతూ ఉండగానే, సెల్వ రాఘవన్ తో ఓ సినిమా చేయడానికి సూర్య సన్నాహాలు చేసుకుంటున్నాడు.

 అంతేకాదు కె.వి. ఆనంద్ .. హరి .. విక్రమ్ కుమార్ లు వినిపించిన కథలను వినేసి, వాళ్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఆయన సుధా కొంగరతో కథా చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం. సుధా కొంగర తమిళంలో చేసిన 'ఇరుదు సుట్రు' సూపర్ హిట్ గా నిలిచింది. అదే సినిమాను తెలుగులో 'గురు' పేరుతో రీమేక్ చేసి ఆమె హిట్ ను అందుకున్నారు. తాజాగా సూర్య కోసం ఆమె ఒక కథను సిద్ధం చేశారట. ఈ కథపై కసరత్తు జరుగుతోందని అంటున్నారు. ఈ ప్రాజెక్టు కూడా దాదాపు ఖాయమైపోయినట్టేనని చెప్పుకుంటున్నారు.     
surya
sudha kongara

More Telugu News