మెగాస్టార్ అభిమానులు ఎడిట్ చేసిన ‘అజ్ఞాతవాసి’ పోస్టర్ ఇదీ!
Add ap7am to your home Screen

మెగాస్టార్ అభిమానులు ఎడిట్ చేసిన ‘అజ్ఞాతవాసి’ పోస్టర్ ఇదీ!

  • కుష్బూ, పవన్ ఇద్దరూ సీరియస్ గా చూస్తున్న పోస్టర్ ను ఎడిట్ చేసిన చిరంజీవి అభిమానులు
  • కుష్బూ స్థానంలో చిరంజీవిని కూర్చో బెట్టిన వైనం
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన పోస్టర్
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ చిత్రంలో ప్రముఖ నటి కుష్బూ ఓ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ ను కుష్బూ ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ పోస్టర్ లో కుష్బూ కూర్చుని ఉండగా, ఆమె వెనుక పవన్ కల్యాణ్ నిలబడి ఉంటాడు. ఈ పోస్టర్ లో కుష్బూ, పవన్ ఇద్దరూ సీరియస్ గా చూస్తూ ఉంటారు.

అయితే, ఇదే పోస్టర్ ని మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎడిట్ చేశారు. కుష్బూ ప్లేస్ లో చిరంజీవి కూర్చుని ఉంటారు. పవన్ కల్యాణ్ చేతిపై ‘ప్రసాద్’ అనే పేరు రాసి ఉండటం ఎడిట్ చేసిన ఈ పోస్టర్ లో ఉండటం గమనార్హం. సామాజిక మాధ్యమాల్లో ఎడిట్ చేసిన ఈ పోస్టర్ వైరల్ గా మారింది.  
Chiranjeevi
Pawan Kalyan

More Telugu News