పూనం కౌర్ తమ బ్రాండ్ అంబాసిడర్ కాదన్న ఏపీ మంత్రి!

  • ప్రభుత్వ పరంగా ఎవరినీ నియమించలేదు
  • బ్రాండ్ అంబాసిడర్ ను పెట్టాలన్న చర్చ కూడా జరగలేదు
  • స్పష్టం చేసిన ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర
మీడియాలో వస్తున్నట్టుగా పూనం కౌర్ ఆంధ్రప్రదేశ్ కు చేనేత బ్రాండ్ అంబాసిడర్ ఏమీ కాదని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. తాను చేనేత శాఖకు మంత్రిగా ఉన్న సమయంలో ఎవరినీ ప్రచారకర్తగా నియమించలేదని ఆయన అన్నారు. ప్రభుత్వ పరంగా అటువంటి నియామకం ఏదీ జరగలేదని చెప్పారు. ఏపీలో చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కల్యాణ్ సిఫార్సు మేరకు పూనం కౌర్ ను నియమించారని కత్తి మహేష్ ఆరోపించిన నేపథ్యంలో కొల్లు రవీంద్ర స్పందించారు. అంబాసిడర్ ను పెట్టాలన్న చర్చ కూడా జరగలేదని, అయితే, కొంతమంది చేనేత సంఘ సభ్యులు పవన్ ను కలిసి ఆయన్ను బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని కోరారని, తనకు అంతవరకే తెలుసునని చెప్పారు.
Go Back to Shorts
Kollu Ravindra
Andhra Pradesh
Brand Ambassidor
Poonam Kaur

More Telugu News