Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ నెల 25న పద్మావత్ సినిమా విడుదల!

  • సెన్సార్ విభాగం అనుమతి
  • U/A సర్టిఫికేట్ జారీ
  • సెన్సార్ సూచనతో టైటిల్ మార్పు
ఎన్నో వివాదాలు, అభ్యంతరాలతో పద్మావతి సిినిమా కాస్తా ‘పద్మావత్’ గా మారి ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దర్శక, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ఈ చిత్రంపై ఎన్నో అంచనాలున్న విషయం విదితమే. ఈ సినిమాకు సెన్సార్ విభాగం U/A సర్టిఫికేట్ ఇచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెషన్ విభాగం సూచన మేరకు ఈ చిత్ర టైటిల్ ను పద్మావతి నుంచి పద్మావత్ గా మార్చడం జరిగింది.

మరో విశేషం ఏమిటంటే, అక్షయ్ కుమార్ నటించిన ప్యాడ్ మ్యాన్ కూడా అదే రోజు విడుదల కానుండడం యాదృచ్ఛికం. పద్మావత్ సినిమాలో దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ నాయికా నాయకులుగా నటించగా, సినిమా నిడివి అంతిమంగా 2.43 గంటలు ఉండనుంది. U/A సర్టిఫికేట్ అంటే పెద్దల పర్యవేక్షణలో పిల్లలు, అందరు పెద్దలు చూడతగినదని అర్థం.
padmavat
deepika

More Telugu News