వాకింగ్ చేస్తే బీమా ప్రీమియంలో మీకు ప్రత్యేక డిస్కౌంట్!... వ్యక్తిగత ఆరోగ్యాన్ని బట్టే ప్రీమియం
- బీమా కంపెనీల కొత్త ప్రతిపాదన
- పరిశీలిస్తున్న కమిటీ
- ఐఆర్డీఏ ఆమోదిస్తే అమల్లోకి
ఈ విధంగా ఒంటికి ధరించే ఫిట్ నెస్ పరికరాలను, పోర్టబుల్ డివైజెస్ ను బీమా రంగంలో ప్రవేశపెట్టే విషయాన్ని అధ్యయనం చేసేందుకు ఐఆర్డీఏ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ముందుకే పాలసీలో ప్రీమియం తగ్గింపు ప్రతిపాదన వచ్చింది. ‘‘ప్రస్తుతం పాలసీదారులు అందరినీ వారి శారీరక ఫిట్ నెస్ తో సంబంధం లేకుండా ఒకే గాటన కడుతున్నాం. ఇలా కాకుండా విడిగా ఒక్కొక్కరి ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా బీమా ప్రీమియంలో మార్పులు చేయాలని సూచించాం’’ అని ఓ బీమా కంపెనీ సీఈవో వెల్లడించారు. అన్ని అంశాలను పరిశీలించిన మీదట ఈ కమిటీ తన సిఫారసులను ఐఆర్డీఏ ముందుంచుతుంది.