లండ‌న్ వీధుల్లో పెద్ద బెలూన్‌... భ‌యాందోళ‌న‌ల‌కు గురైన ప్ర‌జ‌లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లండ‌న్ వీధుల్లో పెద్ద బెలూన్‌... భ‌యాందోళ‌న‌ల‌కు గురైన ప్ర‌జ‌లు!

  • ప‌ర్యాట‌క ఆక‌ర్షణ కోసం క‌డితే, పొరపడిన జ‌నం
  • ఆక్స్‌ఫ‌ర్డ్ వీధిలో ట్రాఫిక్‌కి ఇబ్బందులు
  • తీవ్రంగా గాలి వీయ‌డంతో వైర్ల‌కు త‌గిలిన బెలూన్‌
ప‌ర్యాట‌క ఆక‌ర్షణ కోసం ఏర్పాటు చేసిన భారీ బెలూన్‌ని చూసి లండ‌న్ ప్ర‌జ‌లు పొరపాటు పడి భయానికి గురయ్యారు. లండ‌న్‌లోని ర‌ద్దీ ప్రాంతాల్లో ఒక‌టైన‌ ఆక్స్‌ఫ‌ర్డ్ స‌ర్క‌స్ వీధిలో ఈ బెలూన్‌ను ఏర్పాటు చేశారు. అయితే తీవ్రంగా గాలులు వీయ‌డంతో ఈ బెలూన్ కొద్దిగా కింద‌కి జారింది. దీంతో ఆ రోడ్డు మీదుగా వెళ్లిన డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సుల‌కు అది త‌గిలింది. అంతేకాకుండా అక్క‌డి బిల్‌బోర్డులు, వైర్ల‌కు ఈ బెలూన్ చిక్కుకుని పెద్ద శ‌బ్దం చేయ‌డంతో ఏదో ప్ర‌మాదం జ‌ర‌గ‌నుంద‌ని అక్క‌డి వారంతా భ‌య‌ప‌డ్డారు.

ఈ కార‌ణంగా ట్రాఫిక్‌కి కూడా తీవ్ర అంత‌రాయం క‌లిగింది. కొన్ని క్ష‌ణాల పాటు ఏం జ‌రుగుతోందో అర్థంకాని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని లండ‌న్ వాసులు ట్విట్ట‌ర్‌లో పోస్టులు చేశారు. చివ‌రికి పోలీసులు క‌ల‌గ‌జేసుకుని ట్రాఫిక్‌ని నియంత్రించడంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.
london
balloon
traffic
panic

More Telugu News