శబరిమలై వెళ్లాలనుకున్న మహిళలకు వయసు ధ్రువీకరణ పత్రం తప్పనిసరి
- వెల్లడించిన ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు
- అక్రమ ప్రవేశాలను అరికట్టే ప్రయత్నం
- గత కొన్ని నెలలుగా పెరుగుతున్న అక్రమ ప్రవేశాలు
నైష్ఠిక బ్రహ్మచారి అయిన అయ్యప్ప స్వామి సన్నిధానంలోకి రుతుక్రమంలో ఉన్న మహిళలు ప్రవేశించడానికి వీల్లేదు. అలాగే ఈ జనవరి 14 వరకు అయ్యప్ప భక్తుల రద్దీ ఎక్కువగా ఉండబోతున్న కారణంగా, ధ్రువీకరణ పత్రం సమర్పించడమనే నిబంధన వల్ల చెకింగ్ పనులు సులభతరం అయ్యే అవకాశం ఉంది.