అడిగిన వెంటనే బిర్యానీ ఇవ్వలేదని కత్తులతో దాడి.. హైదరాబాదులో హోటల్ ధ్వంసం!

ఆర్డర్ చేసిన వెంటనే బిర్యానీ ఇవ్వలేదని ఆరోపిస్తూ హోటల్ యజమానిపై కత్తులు, కర్రలతో దాడి చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగోల్‌లోని లక్కీ హోటల్‌కు వచ్చిన రౌడీ మూక బిర్యానీ ఆర్డర్ చేసింది. అయితే బిర్యానీ అయిపోయిందని, ఇంకేదైనా తీసుకోవాలని యజమాని సయ్యద్ అలీ రజా వారిని కోరాడు.

‘మేం స్థానిక కార్పొరేటర్ అనుచరులం. మాకే బిర్యానీ లేదంటావా?’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలీ రజాపై కత్తులు, కర్రలతో దాడికి దిగారు. అరగంటపాటు హోటల్‌లో బీభత్సం సృష్టించారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో బాధితుడు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

Hyderabad
Biryani
Hotel
Nagole

More Telugu News