‘టెట్’ను వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం.. విద్యార్థుల విజ్ఞప్తి మేరకే!
- జనవరి నుంచి ఫిబ్రవరికి వాయిదా పడిన పరీక్ష
- విద్యార్థుల అభ్యర్థన మేరకు మూడు వారాల వాయిదా
- హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు
అయితే పరీక్షకు సిద్ధమయ్యేందుకు సమయం చాలా తక్కువగా ఉందన్న విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ‘టెట్’ను మూడు వారాల పాటు వాయిదా వేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో జనవరి 17న జరగాల్సిన పరీక్ష ఫిబ్రవరికి వాయిదా పడింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ విజ్ఞప్తిని స్వీకరించి పరీక్షను వాయిదా వేయడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.