సికింద్రాబాద్ లో ప్రపంచ పతంగుల పండగతో పాటు 'స్వీట్' ఫెస్టివల్!

  • జనవరి 13 నుంచి 15 వ తేదీ వరకు పతంగుల పండగ
  • అనుబంధంగా స్వీట్ ఫెస్టివల్
  • తెలంగాణ టూరిజం, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ప్రకటన  
ప్రపంచ పతంగుల పండగకు అనుబంధంగా స్వీట్ ఫెస్టివల్ ను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 13 నుంచి 15 వ తేదీ వరకు సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో ప్రపంచ పతంగుల పండగ నిర్వహించనున్నట్టు తెలంగాణ టూరిజం, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

ఈ సందర్భంగా బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్ లో వివిధ రాష్ట్రాల సాంస్కృతిక సంఘాల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో నివసించే వివిధ రాష్ట్రాల, దేశాల  ప్రజల సాంస్కృతిక అంశాలను, ఆహారపు అలవాట్లను ప్రతిబింబించే విధంగా ఈ స్వీట్ ఫెస్టివల్ ను రూపొందించాలని నిర్ణయించినట్టు చెప్పారు.

దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేకత కలిగిన స్వీట్లు  ఉన్నాయని అన్నారు. ఈ ఫెస్టివల్ లో సుమారు 25 రాష్ట్రాలకు సంబంధించిన స్వీట్లను ఒకే చోట అందించనున్నట్టు చెప్పారు. దాదాపు ప్రతి రాష్ట్రం నుండి 50 రకాల స్వీట్లను ప్రదర్శించడంతోపాటు 1000 రకాల స్వీట్లను అమ్మకానికి ఉంచనున్నట్టు తెలిపారు.  
Go Back to Shorts
Hyderabad
burra

More Telugu News