కృష్ణా నదిలో జలవిహారం చేసి రాష్ట్రపతి సతీమణి, కుమార్తె
- విజయవాడలో సవిత, స్వప్నల సందడి
- కనకదుర్గమ్మ దర్శనం
- బోటులో విహారం
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అమరావతి పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఆయన సతీమణి సవిత, కుమార్తె స్వాతి కూడా వచ్చారు. అధికారిక కార్యక్రమాలతో రాష్ట్రపతి బిజీగా ఉండగా... సవిత, స్వప్నలు విజయవాడలో సందడి చేశారు.
తొలుత నగరంలోని స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనను తిలకించారు. ఆ తర్వాత కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత భవానీ ఐలాండ్ వద్ద కృష్ణా నది వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోటులో విహరించారు. భవానీ ద్వీపంలో ఏర్పాటు చేసిన సంప్రదాయ నృత్యాలను తిలకించారు. కొండపల్లి బొమ్మలు, చేనేత వస్తాల ప్రదర్శన చూసి, వాటి వివరాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం లేజర్ షోను తిలకించారు.