విదేశాంగ మంత్రి సుష్మాను కలిసిన కుల్భూషణ్ తల్లి, భార్య
- పాకిస్థాన్ చెర నుంచి విడిపించాలని విజ్ఞప్తి
- మొదటిసారి కుల్భూషణ్ని కలిసిన తల్లి, భార్య
- మరోసారి కుల్భూషణ్ని కలిసే అవకాశం?
ఇంతకుముందు పలుమార్లు పాకిస్థాన్ విదేశాంగ శాఖతో చర్చలు జరిపిన సుష్మా స్వరాజ్ వారికి కుల్ భూషణ్ ని కలిసే అవకాశం కల్పించారు. అలాగే, మరోసారి కూడా కుల్భూషణ్ని కలిసే అవకాశాన్ని కల్పిస్తామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ వీరికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోపక్క, చర్చలు సఫలమైతే కుల్భూషణ్ని విడిపించే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.