Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూ. 17,999కే ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ.. ప్ర‌త్యేక సేల్ నడుపుతున్న అమెజాన్‌

  • ఈ ఫోన్‌ అధికారిక ధ‌ర రూ. 26,000
  • దాదాపు రూ. 8000లు త‌గ్గింపు
  • అమెజాన్ ఛాయిస్‌లో భాగంగా అమ్మ‌కాలు
ఆపిల్ ఐఫోన్ల‌లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన ఆపిల్ ఐఫోన్ ఎస్ఈని అతి త‌క్కువ ధ‌ర‌తో అమెజాన్ ఇండియా అమ్మ‌కాలు చేప‌డుతోంది. అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 26,000 గ‌ల 32జీబీ వేరియంట్‌ను కేవ‌లం రూ. 17,999కే అమెజాన్ అంద‌జేస్తోంది. అమెజాన్ ఛాయిస్‌లో భాగంగా ఈ ఫోన్ మీద దాదాపు రూ. 8000లు త‌గ్గింపు అంద‌జేస్తోంది. అంతేకాకుండా ఈ అమ్మ‌కంలో ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్‌ను కూడా అమెజాన్ ఇండియా అంద‌జేస్తోంది.

రోస్‌గోల్డ్‌, స్పేస్ గ్రే, గోల్డ్‌, సిల్వ‌ర్ రంగుల్లో ఈ ఫోన్ ల‌భ్య‌మ‌వుతోంది. ఫోన్ సైజు చిన్న‌గా ఉండి, అత్యుత్త‌మ ప‌నితీరు కావాల‌నుకునే వారు ఈ ఫోన్‌ను ఎక్కువ‌గా ఆదరిస్తారు. ఇటీవ‌ల దిగుమ‌తి ప‌న్ను పెరిగిన‌పుడు ఐఫోన్ల ధ‌ర‌ల‌ను ఆపిల్ పెంచింది. అలాంటి స‌మ‌యంలో కూడా ఇంత త‌క్కువ ధ‌ర‌కు అమెజాన్ విక్ర‌యాలు చేప‌డుతుండ‌టం నిజంగా విశేష‌మేన‌ని టెక్ గురులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
apple
iphone
amazon india
amazon choice

More Telugu News