'బాహుబ‌లి 2' రికార్డును దాట‌లేక‌పోయిన 'టైగ‌ర్ జిందా హై'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బాహుబ‌లి 2' రికార్డును దాట‌లేక‌పోయిన 'టైగ‌ర్ జిందా హై'

  • మొద‌టిరోజు కలెక్షన్లు రూ. 33.75 కోట్లు మాత్ర‌మే  
  • రూ. 41 కోట్లు వ‌సూలు చేసిన 'బాహుబ‌లి 2' హిందీ వెర్ష‌న్‌
  • 5700ల థియేట‌ర్ల‌లో విడుద‌లైన 'టైగ‌ర్ జిందా హై'
భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన స‌ల్మాన్ ఖాన్ 'టైగ‌ర్ జిందా హై' చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న‌ప్ప‌టికీ అనుకున్న స్థాయిలో రికార్డులు మాత్రం బ‌ద్ద‌లుకొట్టలేకపోయింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 5700ల‌ థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం మొద‌టి రోజు క‌లెక్ష‌న్ల విష‌యంలో 'బాహుబ‌లి 2' రికార్డును తిర‌గ‌రాస్తుంద‌ని అభిమానులు అనుకున్నారు. కానీ కేవ‌లం రూ. 33.75 కోట్లు విడుద‌ల చేసి, రెండో స్థానంతో స‌రిపెట్టుకుంది.

బాహుబ‌లి 2 హిందీ వెర్ష‌న్ మొద‌టిరోజున‌ రూ. 41 కోట్లు వ‌సూలు చేసింది. ఈ ఏడాది అతి ఎక్కువ ఓపెనింగ్ క‌లెక్ష‌న్లు సాధించిన టాప్ 5 చిత్రాల జాబితాను బాలీవుడ్ ట్రేడ్ విశ్లేష‌కుడు త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశారు. ఆయ‌న లెక్క ప్ర‌కారం టాప్ 5లో స‌ల్మాన్ చిత్రాలు రెండు ఉన్నాయి. 'బాహుబలి 2', 'టైగర్ జిందా హై' చిత్రాలు ప్రథమ, ద్వితీయ స్థానాలలో వుండగా, మూడో స్థానంలో 'గోల్‌మాల్ అగైన్' (రూ. 30.14 కోట్లు) ఉండ‌గా నాలుగో స్థానంలో సల్మాన్ చిత్రం 'ట్యూబ్‌లైట్' (రూ. 21.15 కోట్లు) ఉంది. ఇక ఐదో స్థానంలో షారుక్‌ఖాన్ 'రాయిస్' (రూ. 20.42 కోట్లు) చిత్రం ఉంది.
tiger zinda hai
baahubali2
hindi version
taran adarsh

More Telugu News