నటి భావన పెళ్లి తేదీని ఖరారు చేసేశారు!
- నటిగా భావనకి మంచి గుర్తింపు
- నిర్మాత నవీన్ తో నిశ్చితార్థం
- వచ్చేనెల 22న వివాహం
జనవరి 22వ తేదీన వీరి వివాహం కేరళ - త్రిసూర్ లోని 'లలు కన్వెన్షన్ సెంటర్' లో జరగనుంది. ఆ రోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు వీరి వివాహం జరుగుతుంది. భావన .. నవీన్ ఇద్దరూ చిత్రపరిశ్రమకి సంబంధించినవారే అయినా, వివాహ వేడుకకి ఎవరినీ పిలవడం లేదట. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాలే అందుకు కారణమని అంటున్నారు. సినీ పరిశ్రమకి దూరంగా బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్టు చెబుతున్నారు.