వైర‌ల్ ఫొటో: బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డానికి ముందు వరకు ప‌రీక్ష రాసిన త‌ల్లి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైర‌ల్ ఫొటో: బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డానికి ముందు వరకు ప‌రీక్ష రాసిన త‌ల్లి!

  • పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన నేజియా థామ‌స్‌
  • ప‌రీక్ష‌ల్లో కూడా మంచి మార్కులు
  • పొగిడేస్తున్న నెటిజన్లు
ప‌రీక్ష‌లు త‌ప్పించుకోవ‌డానికి ఏం వంక‌లు దొరుకుతాయా అని చాలా మంది ఎదురుచూస్తుంటారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న నేజియా థామ‌స్ ఫొటో చూస్తే కనుక అలాంటి వారు బుద్ధి మనసు మార్చుకుంటారు. ఎందుకంటే, కొద్ది సేవ‌ట్లో బిడ్డ‌కి జ‌న్మ‌నివ్వ‌బోతూ నేజియా ప‌రీక్ష‌లు రాసింది. ఆసుపత్రి బెడ్డు మీద కూర్చుని, ఆన్‌లైన్‌లో ప‌రీక్ష రాస్తున్న ఫొటోను ఆమె షేర్ చేసింది.
 
తాను మ‌గబిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చిన‌ట్లు మ‌రో పోస్ట్‌లో నేజియా వెల్ల‌డించింది. నేజియా ప‌రీక్ష రాస్తూ ఉన్న ఫొటోకి ఇప్ప‌టికి 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు లైకులు, 27వేల‌కి పైగా రీట్వీట్లు వ‌చ్చాయి. అలాంటి స‌మ‌యాల్లోనూ చాలా ధైర్యాన్ని ప్ర‌ద‌ర్శించి, చ‌దువును నిర్ల‌క్ష్యం చేయ‌క‌పోవ‌డాన్ని నెటిజ‌న్లు విప‌రీతంగా పొగిడేస్తున్నారు.
కాగా, అమెరికాలోని కాన్స‌స్‌లో జాన్స‌న్ కౌంటీ క‌మ్యూనిటీ కాలేజీలో నేజియా, సైకాల‌జీ చ‌దువుతోంది. గ‌ర్భం దాల్చిన త‌ర్వాత 39 వారాల వ‌ర‌కు ఆమె కాలేజీలోనే ఉండడం విశేషం.
viral photo
twitter
exam
america

More Telugu News