Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానున్న అమెజాన్ ఇండియా

  • టెనార్ బ్రాండ్‌తో ఇప్ప‌టికే రెండు ఫోన్లు విడుద‌ల చేసిన సంస్థ‌
  • మూడో ఫోన్ విడుద‌ల‌ జ‌న‌వ‌రిలో
  • వెల్ల‌డించిన అమెజాన్ ఇండియా
టెనార్ బ్రాండ్ పేరుతో స్మార్ట్‌ఫోన్ రంగంలో ప్ర‌వేశించిన ఆన్‌లైన్ దిగ్గ‌జ సంస్థ అమెజాన్ ఇండియా.. త్వ‌ర‌లో కొత్త మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేయ‌నుంది. ఈ మేర‌కు అమెజాన్ ఇండియా ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ఇప్ప‌టికే టెనార్‌ బ్రాండ్ పేరుతో ఈ, జీ అనే స్మార్ట్‌ఫోన్ల‌ను అమెజాన్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఒక ప‌క్క ఆన్‌లైన్ మార్కెట్‌లో త‌న స‌త్తాను చాటుతూ, మ‌రోవైపు మొబైల్ మార్కెట్‌ను విస్త‌రించుకునేందుకు అమెజాన్ ప్ర‌య‌త్నిస్తోంది.

కొత్త సంవత్సరంలో ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ప్రైవేటు లేబుల్స్‌ సోలిమో, సింబల్‌, మిక్స్‌ బ్రాండ్ల కింద ఫ్యాషన్‌, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లను కూడా అమెజాన్‌ విక్రయిస్తోంది. ఆన్‌లైన్ వ్యాపారంలో అమెజాన్‌కి పోటీగా ఉన్న ఫ్లిప్‌కార్ట్‌ కూడా ఇటీవల స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి అడుగుపెట్టి, బిలియన్ బ్రాండ్ పేరుతో స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.
amazon india
flipkart
smart phone
tenor
billion

More Telugu News