గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఓటమిపై రాహుల్ గాంధీ స్పందన!
- ప్ర‌జ‌ల తీర్పును అంగీక‌రిస్తున్నాం
- కొత్త ప్ర‌భుత్వాల‌కు అభినంద‌న‌లు
- క్ర‌మశిక్ష‌ణ‌, ధైర్య‌మే కాంగ్రెస్ పార్టీ బ‌లం
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో ప్రజల తీర్పును అంగీకరిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఇరు రాష్ట్రాల్లో ఏర్పడే కొత్త ప్రభుత్వాలకు అభినందనలు తెలుపుతున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. తనపై అభిమానం చూపిన రెండు రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ నేతలు మంచి ప్రవర్తనతో ప్రచారం జరిపి తాను గర్వపడేలా చేశారని అన్నారు. క్రమశిక్షణ, ధైర్యమే కాంగ్రెస్ పార్టీ బలమని తమ నేతలు, కార్యకర్తలు వాటినే ప్రచారంలో చూపారని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.