ప్ర‌కాశ్ ప‌దుకునేతో సెల్ఫీ దిగిన రణ్‌వీర్ సింగ్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్ర‌కాశ్ ప‌దుకునేతో సెల్ఫీ దిగిన రణ్‌వీర్ సింగ్‌

  • 'బ్యాడ్మింట‌న్ దేవుడు' అంటూ కొనియాడిన హీరో
  • ప‌దుకునే-ద్రావిడ్ అకాడ‌మీ ఆవిష్క‌ర‌ణ వేడుక‌లో పాల్గొన్న ర‌ణ్‌వీర్‌
  • హాజ‌రైన అభిన‌వ్ బింద్రా, విశ్వ‌నాథ‌న్ ఆనంద్‌
త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ దీపికా ప‌దుకునే తండ్రి, మాజీ బ్యాడ్మింట‌న్ స్టార్ ప్ర‌కాశ్ ప‌దుకునేతో బాలీవుడ్ న‌టుడు ర‌ణ్‌వీర్ సింగ్ సెల్ఫీ దిగాడు. ఈ సెల్ఫీని త‌న ఇన్‌స్టాంగ్రాంలో ర‌ణ్‌వీర్ పోస్ట్ చేశాడు. 'బ్యాడ్మింటన్ దేవుడు' అంటూ ప్ర‌కాశ్ ప‌దుకునేని ర‌ణ్‌వీర్ కొనియాడాడు. ఇది చూసిన వారంతా... 'అనుష్క శ‌ర్మ బాట‌లో ర‌ణ్‌వీర్ కూడా ప‌య‌నిస్తున్నాడు, రేపో ఎల్లుండో దీపికా, ర‌ణ్‌వీర్ కూడా పెళ్లి వార్త చెబితే బాగుండును' అని ఆశిస్తున్నారు. అవును... విరాట్ - అనుష్కల మ‌ధ్య ప్రేమలాగే, ర‌ణ్‌వీర్ - దీపికాల మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం కూడా కొన్నాళ్లుగా మీడియాలో నానుతూనే ఉంది. దీంతో అభిమానులు అలా ఆశిస్తున్నారు.

బెంగ‌ళూరులో ప‌దుకునే-ద్రావిడ్ సెంట‌ర్ ఫ‌ర్ స్పోర్ట్ ఎక్స‌లెన్స్ ప్రారంభ‌మైంది. ఈ అకాడ‌మీ ఆవిష్క‌ర‌ణ వేడుక‌కు ర‌ణ్‌వీర్‌తో పాటు అభిన‌వ్ బింద్రా, విశ్వ‌నాథ‌న్ ఆనంద్‌, గీత సేథీలు హాజ‌రయ్యారు. ఆ వేడుక‌లో భాగంగా ర‌ణ్‌వీర్ ఈ సెల్ఫీ తీసుకున్నాడు.
prakash padukone
deepika padukone
ranveer singh

More Telugu News