పాక్ రక్తసిక్తం.. చర్చిపై ఉగ్రదాడి!
- క్వెట్టాలో మారణహోమం.. నెత్తురోడిన చర్చ్
- ఐదుగురి దుర్మరణం... 20 మందికి గాయాలు
- పవిత్ర స్థలంలో నరమేధం
ఆత్మాహుతి బాంబర్లు చర్చిలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా... భద్రతాదళాలు ఒక ముష్కరుడిని గేటు వద్దే హతమార్చాయి. మరో సూసైడ్ బాంబర్ చర్చి ప్రాంగణంలోకి దూసుకెళ్లి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ క్రమంలో ప్రార్థనలు జరగాల్సిన పవిత్ర స్థలం నెత్తురోడింది. క్షతగాత్రుల హాహాకారాలతో చర్చి ప్రాంగణం భయానకంగా మారింది.