హిందూపురంలో 'వైఎస్సార్ జనతా క్యాంటీన్' ప్రారంభం!
- తక్కువ ధరకే అల్పాహారం, భోజనం
- పేద ప్రజలకు చేయూత కోసమే ఏర్పాటు
- ఆర్థికసాయం అందిస్తోన్న డాక్టర్ సాయిప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్
పేద ప్రజలు రోజంతా కష్టపడి సంపాదించుకున్న డబ్బు భోజనాలకే ఖర్చు పెట్టాల్సి వస్తోందని, వారికి చేయూతగా ఉండేందుకు ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ క్యాంటీన్ల ద్వారా అతి తక్కువ ధరకు అంటే రూ. 9కే కడుపు నిండా ఆహారం అందిస్తున్నట్లు నవీన్ నిశ్చల్ పేర్కొన్నారు. ఈ క్యాంటీన్ల నిర్వహణకు డాక్టర్ సాయిప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ఆర్థిక సాయం అందిస్తోంది.