ఎప్పటికీ కలిసుండాలని ప్రమాణం చేసుకున్నాం: పెళ్లి తరువాత కోహ్లీ తొలి వ్యాఖ్య

  • ఒకరికి ఒకరం ప్రమాణం చేసుకున్నాం
  • ఈ రోజు మాకెంతో ప్రత్యేకం
  • ట్విట్టర్ లో వ్యాఖ్యానించిన కోహ్లీ
'జీవితంలో ఎప్పటికీ ప్రేమానుబంధం మధ్య కలిసి ఉంటామని నేడు మేమిద్దరం ఒకరికి ఒకరం ప్రమాణం చేసుకున్నాం. ఈ వార్తను మీ అందరితో పంచుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా కుటుంబసభ్యులు, అభిమానులు, బంధుమిత్రుల మద్దతుతో, ప్రేమ, ఆశీస్సులతో ఈ రోజు మరింత ప్రత్యేకంగా మారింది. మా ప్రయాణంలో పాలుపంచుకున్నందుకు కృతజ్ఞతలు" అని విరాట్ కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. విరాట్ ను వరించేందుకు అనుష్క పూలమాలను తీసుకురాగా, తను ఆనందంతో పొంగిపోతున్న చిత్రాన్ని పోస్టు చేశాడు. కోహ్లీ ట్వీట్ లక్షలాది లైక్స్, వేలాది షేర్స్ తెచ్చుకుంది.
Go Back to Shorts
Virat Kohli
Anushka Sharma
Marriage
Twitter

More Telugu News