భోజనంలో ఎన్ని రుచులో!.. 29 రాష్ట్రాల వంటకాల ఫొటోలను పోస్ట్ చేసిన విదేశీ వ్య‌వ‌హారాల శాఖ‌!

  • ఆక‌ట్టుకుంటున్న ట్వీట్‌
  • నోరూరుతోందంటున్న నెటిజ‌న్లు
  • భార‌త రుచుల్ని గుర్తుచేసే ప్ర‌య‌త్నం
భార‌త విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ తమ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో దేశంలోని 29 రాష్ట్రాల థాలి (భోజనం)ల‌ను షేర్ చేసి నెటిజ‌న్లను ఆక‌ట్టుకుంటోంది. వివిధ రాష్ట్రాల‌కు ప్ర‌త్యేకంగా ఉండే వంట‌ల‌ను వివ‌రిస్తూ, ఫొటోల‌తో స‌హా షేర్ చేసిన ఆ ట్వీట్ చూస్తే ఎవ‌రికైనా నోరూరాల్సిందే. నెటిజ‌న్లు కూడా అదే అంటున్నారు.

వాటిని చూస్తోంటే 'దేశంలో ఇన్ని ర‌కాల సంప్ర‌దాయ వంట‌లున్నాయా?' అంటూ ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది. దేశ‌వ్యాప్తంగా భార‌త ప్ర‌జ‌ల్లో ఉన్న రుచుల భిన్న‌త్వాన్ని గుర్తుచేసే ప్ర‌య‌త్నంలో భాగంగా విదేశీ వ్య‌వ‌హారాల శాఖ ఈ ప్ర‌య‌త్నం మొద‌లుపెట్టిన‌ట్లు తెలుస్తోంది.
Go Back to Shorts
thali
gujarat
Andhra Pradesh
Tamilnadu
mea
tweet

More Telugu News