మేగజైన్ ముఖచిత్రంలో ఉన్న ఆ చేయి ఎవరిది?... సమాధానం చెప్పిన 'టైమ్' పత్రిక!
- పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన #MeToo ఉద్యమకారులు
- 'మౌనాన్ని ఛేదించిన వారు'గా ఐదుగురి ఫొటోలు
- వారితో పాటు ఒకరి మోచేయిని ముద్రించిన టైమ్
దీనిపై టైమ్ మేగజైన్ స్పందించింది. అది టెక్సాస్‌కు చెందిన ఓ యువతి చేయి అని పేర్కొంది. ఆమె కూడా లైంగిక వేధింపులకు గురైందని, కానీ వివరాలు బయటికొస్తే తన కుటుంబం ఇబ్బందులు పడుతుందేమోనని భయపడటంతో పేరు, ముఖం తెలియనీయకుండా అలా ముద్రించినట్లు వెల్లడించింది. ఆమె లాగే ఇంకా ఎంతో మంది మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోలేక వేదన అనుభవిస్తున్నారని, వారందరికీ ఆమె చేయి చిహ్నంగా నిలిచిందని టైమ్ వివరణ ఇచ్చింది.