భర్తను చంపిన 13 ఏళ్ల తరువాత పోలీసులకు దొరికిపోయిన భార్య!
- భర్తను హత్య చేసి సెప్టిక్ ట్యాంక్లో పడేసిన వైనం
- అదే ఇంట్లో సెక్స్ రాకెట్ నడుపుతోన్న మహిళ
- పోలీసుల దాడులు.. సెప్టిక్ ట్యాంక్లో అస్థిపంజరం గుర్తింపు
- మహారాష్ట్రలోని పల్గర్ జిల్లా బోయిసర్లో ఘటన
తాజాగా ఆ ఇంట్లో వ్యభిచారం సాగుతోందన్న ఆరోపణలు రావడంతో, పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. నలుగురు యువతులకు విముక్తి కల్పించి, ఇంటి మొత్తాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో సెప్టిక్ ట్యాంక్లో ఓ ఆస్థిపంజరం దొరకడంతో పోలీసులు ఆమెను విచారించగా, తన భర్తను హత్య చేసి అక్కడ పారేసినట్టు ఆమె అంగీకరించింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.