'సైరా' మెస్మరైజ్ చేస్తుందంటున్న ఉపాసన!

  • అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్
  • నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్
  • చిత్రంపై ఉపాసన ట్వీట్ 
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా' షూటింగ్, ప్రత్యేకంగా వేసిన భారీ సెట్ లో నేడు షూటింగ్ ప్రారంభం కాగా, చిరంజీవి కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన, ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరిస్తూ, తన ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టారు. గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతూ ఉండగా, ఇప్పటికే సెట్లోకి వచ్చిన నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఉపాసన కామినేని తన ట్వీట్ లో, "కొణిదెల కుటుంబానికి ఇదో కొత్త ప్రారంభం. మిస్టర్ సి తన రెండో ప్రాజెక్టుగా, మామయ్యతో కలసి 151వ చిత్రాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ చిత్రంలోని సైరా నరసింహారెడ్డి పాత్ర, చిత్ర యూనిట్ పడుతున్న శ్రమ మిమ్మల్ని తప్పకుండా మెస్మరైజ్ చేస్తాయి" అని పేర్కొంది.
Go Back to Shorts
Chiranjeevi
Ramcharan
Saira
Upasana Kamineni

More Telugu News