Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్‌ల చిత్రం గురించి మ‌రో అప్‌డేట్‌... స్పోర్ట్స్ డ్రామా?

  • క‌థ‌ను అందించ‌నున్న విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌, గుణ్ణం గంగరాజు
  • హీరోలిద్ద‌రి ఇమేజ్‌కి స‌రిపోయేలా క‌థ‌
  • ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు
ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్‌ల‌తో రాజమౌళి చేయనున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవ‌ల ఈ చిత్రంలో ఎలాంటి గ్రాఫిక్స్ వాడ‌బోర‌న్న అప్‌డేట్‌తో పాటు మ‌రో కొత్త విష‌యం కూడా తెలిసింది.

ఇద్ద‌రు పెద్ద హీరోల‌కు స‌రిపోయేలా ఒక స్పోర్ట్స్ డ్రామాను రాజ‌మౌళి తెర‌కెక్కించ‌నున్న‌ట్లు ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ఈ సినిమాకు క‌థ‌ను గుణ్ణం గంగరాజు అంద‌జేస్తుండ‌గా దాన్ని అభివృద్ధి చేయ‌డానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్ స‌హాయం చేస్తున్న‌ట్లు స‌మాచారం. ప్రస్తుతం వారిద్దరూ కలసి కథకు సంబంధించిన పనులలో బిజీగా వున్నట్టు తెలుస్తోంది.    
ntr
ram charan
rajmouli
sports drama

More Telugu News