పవన్ కల్యాణ్ వస్తే పరిస్థితి మారిపోతుంది... నాకు అసెంబ్లీ వద్దు!: జేసీ కుమారుడి కీలక వ్యాఖ్యలు
- ఎంపీగా పోటీ చేసేందుకే ఆసక్తి
- ఎక్కువ మందికి సేవ చేయవచ్చు
- పవన్ కు తిక్కలేదు, లెక్క మాత్రమే ఉంది
- జేసీ కుమారుడు పవన్ రెడ్డి
తనకు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ పడాలన్న ఆలోచన లేదని, పార్లమెంట్ కు పోటీ చేసి గెలిస్తేనే ఎక్కువ మంది ప్రజలకు సేవ చేయవచ్చన్నది తన అభిమతమని జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు, యువనేత జేసీ పవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఓ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, అనంతపురం, తాడిపత్రి, హిందూపురం తదితర నియోజకవర్గాల్లో రాజకీయాలు మరో ఏడాదిన్నరలో ఎంతో మారనున్నాయని అభిప్రాయపడ్డారు. తాను రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి లేని వ్యక్తినని అన్నారు.
రాజకీయాల్లోకి పవన్ కల్యాణ్ వస్తున్నారని వస్తున్న వార్తలను ప్రస్తావిస్తూ, ఆయన పార్టీపై ఇప్పటికి ఇంకా స్పష్టతేలేదని చెప్పారు. జనసేన స్వతంత్రంగా పోటీ చేస్తుందా? లేక మరేదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో కూడా తెలియదని, పొత్తు పెట్టుకుంటే, ఈ ప్రాంతంలోని సీట్లు జనసేనకు వెళతాయని భావిస్తున్నానని అన్నారు. అందుకే అసెంబ్లీ సెగ్మెంట్ పై కాకుండా, పార్లమెంట్ సెగ్మెంట్ పైనే దృష్టిని పెట్టానని అన్నారు. పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రుడని, తన తండ్రి అన్నా ఆయనకు అభిమానం ఉందని, ఆయనకు ఎప్పటికీ రుణపడి వుంటామని అన్నారు. కానీ, ఇటీవలి కాలంలో ఆయనతో మాట్లాడలేదని చెప్పారు. పవన్ కల్యాణ్ కు తిక్కలేదని, లెక్క మాత్రం ఉందని అన్నారు.