కనుగుడ్డుపై టాటూ వేయించుకున్న మోడల్.. దృష్టి కోల్పోయిన ముద్దుగుమ్మ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కనుగుడ్డుపై టాటూ వేయించుకున్న మోడల్.. దృష్టి కోల్పోయిన ముద్దుగుమ్మ!

  • ‘స్క్లెరా’ పద్ధతిలో కనుగుడ్డుపై పర్పుల్ కలర్ వేయించుకున్న కెనడా మోడల్
  • కంటి చూపు పూర్తిగా కోల్పోయిన వైనం
  • మరెవరూ తనలా కావద్దంటూ ఫేస్‌బుక్‌లో ప్రచారం
ఫ్యాషన్ వెర్రి తలలు వేస్తోంది. నిత్యం ఫ్యాషన్‌బుల్‌గా కనిపించడానికి మోడల్స్ పడే తహతహ అంతా ఇంతా కాదు. మిగతా మోడల్స్ కంటే భిన్నంగా ఉండాలన్న ఉద్దేశంతో కెనడాకు చెందిన ఓ మోడల్ చేసిన ప్రయత్నం వికటించింది. ప్రస్తుతం పూర్తిగా కన్నును కోల్పోయే పరిస్థితికి చేరుకుంది.

కాట్ గాలింగర్ ప్రముఖ మోడల్. కొన్ని నెలల క్రితం ఓ టాటూ ఆర్టిస్ట్ ఆమె కనుగుడ్డులోని తెల్లని ప్రాంతాన్ని అందంగా మారుస్తానని చెప్పాడు. దీనికి అంగీకరించిన ఆమె తెల్లని కనుగుడ్డును తనకు ఇష్టమైన వంకాయ (పర్పుల్) రంగులోకి అందంగా మార్చాలని కోరింది. సరేనన్న టాటూ ఆర్టిస్ట్ ‘స్క్లెరా’ అనే పద్ధతిలో కనుగుడ్డును వంకాయ రంగులోకి మార్చాడు. అయితే ఆ మరుసటి రోజే కన్ను ఉబ్బిపోయి కను రెప్ప వేయడం ఇబ్బందిగా మారింది. క్రమంగా బాధ ఎక్కువైంది. భరించలేని కాట్ వైద్యులను సంప్రదించగా కన్ను పూర్తిగా పోయే అవకాశం ఉందని చెప్పడంతో హతాశురాలైంది.
 
తనలాగే మరెవరూ ఇలా అనవసర అందాలకు పోకూడదనే ఉద్దేశంతో తన కంటి ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ హెచ్చరికలు చేస్తోంది. ప్రతి ఒక్కరూ ‘స్క్లెరా’కు దూరంగా ఉండాలని కోరుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో!
Canada
Model
Tattoo
Eyeball

More Telugu News