ఢిల్లీ టెస్టుపై కాలుష్యం ఎఫెక్ట్... ఆటగాళ్లకు మాస్కులిచ్చి ఆడిస్తున్న ఐసీసీ!
- మ్యాచ్ పై కాలుష్యం ప్రభావం
- కొద్దిసేపు నిలిచిన ఆట
- మాస్కులు పంపిణీ చేసిన అధికారులు
- భారత స్కోరు 523/6
కాగా, ఈ మ్యాచ్ లో డబుల్ సెంచరీ సాధించిన కోహ్లీ అప్రతిహతంగా ముందుకు సాగుతున్నాడు. మరోవైపు ఒక్కో వికెట్ పడిపోతున్నా తనదైన షాట్లతో అలరిస్తూ, భారత్ ను మరింత లీడ్ లోకి తీసుకెళుతున్నాడు. హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సందకన్ బౌలింగ్ లో అవుట్ కాగా, ఆపై వచ్చిన అశ్విన్ 4 పరుగులకే గమాగే బౌలింగ్ లో పెరీరాకు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం క్రీజులో సాహా 1, కోహ్లీ 243 పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం భారత స్కోరు 6 వికెట్ల నష్టానికి 523 పరుగులు.