మందు కొట్టి దొరికిపోయి... కెమెరాను చూసి కారు కింద నక్కి... కమెడియన్ నవీన్ పరుగుల వీడియో!

  • మద్యం తాగి కారు నడుపుతూ వచ్చిన నవీన్
  • మీడియా నుంచి తప్పించుకునేందుకు పాట్లు
  • టీవీ చానళ్లలో వైరల్
శనివారం రాత్రి హైదరాబాద్, జూబ్లీహిల్స్ లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించిన వేళ, మద్యం తాగి కారు నడుపుతూ వచ్చిన కమేడియన్ నవీన్, మీడియా నుంచి తప్పించుకునేందుకు నానా పాట్లూ పడ్డాడు. కారు కిందకు దూరిపోయాడు. అప్పటికే మీడియా అతన్ని పసిగట్టగా, రోడ్డుపై ఉరుకులు, పరుగులు పెట్టాడు.

ఈ దృశ్యాలకు సంబంధించిన నవీన్ వీడియో ఇప్పుడు తెలుగు వార్తా చానళ్లలో వైరల్ అవుతోంది. మందు కొట్టి వాహనాలు నడుపుతూ వచ్చిన హైదరాబాదీలు పలువురు పోలీసులకు పట్టుబడ్డారు. నవీన్ తప్పించుకునేందుకు పడ్డ పాట్ల వీడియోను మీరూ చూడవచ్చు.

Go Back to Shorts
Naveen
drunken drive
Hyderabad
Jubilee Hills

More Telugu News