'బిగ్ టీవీ'ని అమ్మేసిన అనిల్ అంబానీ
- అప్పులను తగ్గించుకోవడానికి విక్రయం
- పెంటెల్, వీకాన్ మీడియాతో డీల్
- కస్టమర్లకు సేవలు కొనసాగుతాయన్న ఆర్ కామ్
తమ రుణ భారాన్ని తగ్గించేందుకు ఈ లావాదేవీ ఉపయుక్తకరమని, డీల్ తరువాత, ఆర్ కామ్ వాటాదార్లకు, రుణదాతలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపింది. తాము బిగ్ టీవీని విక్రయించినా, తమ సేవలను వాడుకుంటున్న 12 లక్షల మంది కస్టమర్లకు ఎంటర్ టెయిన్ మెంట్ సర్వీసెస్ విషయంలో అంతరాయం ఉండదని తెలిపింది. సంస్థలో విధులు నిర్వహిస్తున్న 500 మంది కొనసాగుతారని పేర్కొంది.