నా కూతురును చూసి ఎంతో గర్వపడుతున్నా: మోహన్ బాబు
- జీఈ సదస్సులో ప్రసంగించనున్న మంచు లక్ష్మి
- కూతురుని చూసి గర్విస్తున్నానన్న మోహన్ బాబు
- లక్ష్మికి మరింత శక్తి చేకూరాలంటూ ఆకాంక్షించిన తండ్రి
"నా కుమార్తెను చూసి ఎంతో గర్విస్తున్నా. గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ లో నా కుమార్తె 'ఎన్ జెండర్డ్' డైలాగ్స్ ప్యానల్ లో ఉండటం నాకు ఎంతో సంతోషంగా ఉంది" అంటూ ట్వీట్ చేశారు. లక్ష్మికి మరింత శక్తి చేకూరాలని... భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.