Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇవాంకాకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వాల‌ని కోరుతున్న స్టాండప్ క‌మెడియన్‌... వీడియో చూడండి

  • ఇవాంకా రాక‌తో హైద‌రాబాద్ రూపురేఖ‌లు మారిపోయాయ‌ని సెటైర్‌
  • ఆరు నెల‌ల‌కు ఒక‌సారి రావాల‌ని కోరిన స్టాండ‌ప్ క‌మెడియ‌న్ రాజ‌శేఖ‌ర్
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియో
వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ త‌ర‌ఫున ఇవాంకాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల‌ని ఓ స్టాండ‌ప్ క‌మెడియ‌న్ త‌న వీడియోలో సెటైరిక‌ల్‌గా వెల్ల‌డించాడు. ఇవాంకా ట్రంప్ రాక‌తో హైద‌రాబాద్ రోడ్ల‌న్నీ బాగుప‌డ్డాయ‌ని, వ‌ర్షాకాలంలో హైద‌రాబాదీలు చేసిన పూజ‌ల‌ను దేవుడు ఆల‌కించి, ఇవాంకాను పంపించాడ‌ని, ఆమెను ఆరు నెల‌లకొక‌సారి ఇక్క‌డికి రావాల‌ని కోరుతూ స్టాండ‌ప్ క‌మెడియ‌న్ రాజ‌శేఖ‌ర్ జోకులు వేశాడు.

ఇంకా ఇవాంకా వ‌య‌సు గురించి, ఆమె వృత్తి గురించి, హైద‌రాబాద్ ప‌రిస్థితి గురించి కొన్ని జోకులు వేస్తూ ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇవాంకా రాక‌తో సిటీలో వ‌చ్చిన మార్పు 'శివాజీ' సినిమాలో ర‌జ‌నీకాంత్ న‌డుస్తుంటే ఆ వెన‌కాలే రోడ్డు ప‌డుతూ రావడాన్ని గుర్తుచేసింద‌ని రాజ‌శేఖ‌ర్ వేసిన జోక్ ఈ వీడియోకి హైలైట్‌.

ivanka trump
standup
comedy
rajeshekar
mla
hyderabad

More Telugu News