Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డమ్మీ పాముతో బెదిరించిన స్నేహితుడిపై పగ తీర్చుకున్న సన్నీ లియోన్... వీడియో చూడండి!

  • రెండు కేకుల‌తో అత‌ని ముఖాన్ని పులిమేసిన బాలీవుడ్ తార‌
  • 'నాతో పెట్టుకుంటే ఇలాగే జ‌రుగుతుంది' అంటూ ట్వీట్‌
  • స‌న్నీతో జాగ్ర‌త్త అంటూ కామెంట్లు చేస్తున్న నెటిజ‌న్లు
సీరియ‌స్‌గా స్క్రిప్ట్ చ‌దువుతున్న స‌న్నీ లియోన్ మీద డ‌మ్మీ పాము వేసి ఆమె స్నేహితుడు భ‌య‌పెట్టించిన వీడియో వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆమె స్నేహితుడు చేసిన ప‌నికి ప్ర‌తిగా స‌న్నీ లియోన్ కూడా ఓ చిలిపి ప‌ని చేసి ప్ర‌తీకారం తీర్చుకుంది. ఆ వీడియోను స‌న్నీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

సీరియ‌స్‌గా ప‌నిచేసుకుంటున్న త‌న స్నేహితుడి ముఖాన్ని వెన‌క నుంచి వ‌చ్చిన స‌న్నీ రెండు కేకుల‌తో పులిమేయడం ఈ వీడియోలో చూడొచ్చు. 'ప‌గ తీర్చుకున్నాను... నాతో పెట్టుకుంటే ఇలాగే జ‌రుగుతుంది' అని పోస్ట్ పెట్టింది. ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు మాత్రం స‌న్నీతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆమె బృందాన్ని హెచ్చరిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
Sunny Leone
prank
revenge

More Telugu News