ఢిల్లీలో ధ‌ర్నాకు తెలంగాణ స‌ర్కారు నిర్ణ‌యం.. మద్దతు తెలుపుతూ కేసీఆర్‌కు డీఎంకే నేత స్టాలిన్ లేఖ‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీలో ధ‌ర్నాకు తెలంగాణ స‌ర్కారు నిర్ణ‌యం.. మద్దతు తెలుపుతూ కేసీఆర్‌కు డీఎంకే నేత స్టాలిన్ లేఖ‌!

  • రిజర్వేషన్‌ల‌ అమలు అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలని తెలంగాణ సర్కారు డిమాండ్
  • తెలంగాణ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని అభినందించిన స్టాలిన్‌
  • మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌
షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాల వారికి రిజర్వేషన్‌ల‌ను అమలు పరిచే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స‌ర్కారు ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ధర్నా చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ విష‌యంపై త‌మిళ‌నాడు ప్ర‌తిప‌క్ష నేత, డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు. షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాల కోసం తలపెట్టిన ధర్నాకు తాము మద్దతు ప్రకటిస్తున్న‌ట్లు చెప్పారు.          
stalin
dmk
KCR

More Telugu News