కేటీఆర్ బావమరిదిపై ఆరోపణలు చేసినందుకు.. రేవంత్‌రెడ్డికి లీగల్ నోటీసులు
- తెలంగాణలో డ్రగ్స్ విక్రయాల వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఆరోపణలు
- కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్ర ప్రసాద్‌కు సంబంధం ఉందని వ్యాఖ్య
- నాకు ఎటువంటి పబ్‌లూ లేవు
- నిన్న జరిగిన సన్‌బర్న్ పార్టీతో కూడా నాకు సంబంధం లేదు
ఈ విషయంలో ఈ రోజు రేవంత్ రెడ్డికి పాకాల రాజేంద్రప్రసాద్ లీగల్ నోటీసులు పంపారు. రేవంత్‌రెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేశారని అందులో ఆయన పేర్కొన్నారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగిన సన్‌బర్న్ పార్టీ సహా నగరంలో జరుగుతోన్న ఇతర ఈవెంట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. నగరంలో అసలు తనకు పబ్‌లు లేవని కూడా అన్నారు. రేవంత్ రెడ్డి తనకు సారీ చెప్పాలని ఆయన పేర్కొన్నారు.